కేఏ పాల్‌గా మారిపోయిన విజయసాయి రెడ్డి: బొత్స సత్యనారాయణ

కలం, వెబ్ డెస్క్: విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) మరో కేఏ పాల్‌గా మారిపోయారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) విమర్శించారు. ఏపీలో ఖాళీగా ఉండే వ్యక్తుల్లో విజయసాయి రెడ్డి ఒకరు అన్నారు. ఆయన వ్యాఖ్యలను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాను కేవలం ప్రజా సమస్యలపైనే మాట్లాడుతానని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నాశనం అవుతున్నాయని ఆరోపించారు. డీఎస్సీలో పెద్ద కుంభకోణం జరిగిందని.. చర్చిద్దామంటే మంత్రి ఎందుకు మండలికి రాలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశాలకు వెళ్లడం కూడా మానేశారని విమర్శించారు.

సామాన్యులు ఎలా బతకాలి..?

అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యం రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయని బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మండిపడ్డారు. అందరూ చంద్రబాబులాగా ధనవంతుడిలా ఉండరని, నిత్యావసరాల ధరలు పెరుగుతుంటే సామాన్యులు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఉల్లిపాయలు, పంచధార ధరలు విపరీతంగా పెరుగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ధరలు పెరిగినా ప్రతీసారి కంట్రోల్ చేశామని గుర్తు చేశారు.

Also Read : పవన్ కళ్యాణ్​ బర్త్ డే వేళ.. సరికొత్త కార్యక్రమానికి జనసేన శ్రీకారం!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>