epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

‘గిఫ్ట్ సిటీ’లో ఇండియన్ ఏఐ రీసెర్చ్ .. దేశంలోనే ఫస్ట్ సెంటర్‌గా ఏర్పాటు

కలం డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీని నిర్మించనున్నట్లు ప్రకటించగా గుజరాత్ సర్కార్ దేశంలోనే మొదటి ఇండియన్ ఏఐ రీసెర్చ్ ఆర్గనైజేషన్‌ను ‘గిఫ్ట్’ సిటీలో (GIFT City) నెలకొల్పుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో లోతైన పరిశోధన, అభివృద్ధి అవసరాలను తీర్చేలా ఈ సెంటర్ పనిచేయనున్నది. వచ్చే ఏడాది నుంచి ఇది పనిచేయడం ప్రారంభించనున్నది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ‘గిఫ్ట్‘ సిటీలో ఈ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో ఒక త్రైపాక్షిక ఒప్పందం ద్వారా ఈ సెంటర్ ఏర్పాటు కానున్నది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వా లతో పాటు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయెన్స్ భాగస్వామ్యంతో ఇది ఏర్పాటవుతున్నది.

నాన్-ప్రాఫిట్ సంస్థగా ఉనికిలోకి

ఇండియన్ ఏఐ రీసెర్చ్ ఆర్గనైజేషన్ జనవరి నుంచే కాల్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ప్ఱభుత్వం తెలిపారు. నాన్-ప్రాఫిట్ సంస్థగా పనిచేస్తుందని వివరించింది. తొలి ఐదేండ్లకు సుమారు రూ. 300 కోట్లు ఖర్చుకానున్నట్లు అంచనా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఐపీఏ తలా 33.33% చొప్పున ఈ భారాన్ని భరించనున్నాయి. ఇందులో మొదటి సంవత్సరానికి తలా రూ. 25 కోట్ల చొప్పున త్వరలో రిలీజ్ చేయనున్నాయి. ఐపీఏలో సన్, టోరెంట్, సిప్లా లాంటి 23 ఫార్మా కంపెనీలు మెంబర్లుగా ఉన్నాయి. కేవలం ఔషధ రంగంలోనే కాకుండా వివిధ రంగాల్లో ఏఐ వినియోగాన్ని విస్తృతం చేయడం, సరళతరమైన తీరులో అందుబాటులోకి తేవడం ఇండియన్ ఏఐ రీసెర్చి ఆర్గనైజేషన్ ఉద్దేశం.

ఇండియా ఏఐ మిషన్‌లో భాగం

కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న ‘ఇండియా ఏఐ మిషన్’లో భాగంగా విద్య, వైద్యం, వ్యవసాయం, సేవా రంగాల్లో ఏఐ వినియోగాన్ని పెంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ లక్ష్య సాధన కోసం గుజరాత్ సర్కార్ ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఏఐ పరిశోధన, వినియోగంలో భారత్‌ను అగ్రస్థానంలో నిలపడం ఈ మొత్తం ప్రాజెక్టు లక్ష్యం. ఇండియా ఏఐ క్లౌడ్ లాంటి కొన్ని ప్లాట్‌ఫామ్‌ల సమన్వయంతో ఏఐ రీసెర్చ్ ఆర్గనైజేషన్ పనిచేయనున్నది. భవిష్యత్తుల ఏఐ వినియోగం విస్తృతం కానున్నందున దానికి తగినట్లుగా వర్క్ ఫోర్స్ పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు లభించేలా గిఫ్ట్ సిటీలోని(GIFT City) ఏఐ రీసెర్చ్ ఆర్గనైజేషన్ పనిచేయనున్నది.

Read Also: ఆరోజే కేసీఆర్‌ను ప్రశ్నించా: కవిత షాకింగ్ కామెంట్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>