కలం, మహబూబ్ నగర్ బ్యూరో: సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి మధు భార్య సుమతి ఇటీవల మరణించిన సందర్బంగా ఆ పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ నారాయణ (CPI Narayana) శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ.. సుమతి మరణం వామపక్ష ఉద్యమానికి తీరని లోటు అని అన్నారు జిల్లాలో జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో ఆమెపాత్ర అమోఘమైనదని ఈ సందర్భంగా కొనియాడారు. ఆమె ఆశయ సాధనకు కమ్యూనిస్టులుగా అందరం కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి బాలకిషన్ , జిల్లా సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి పరమేశ్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రాము, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జి సత్యనారాయణ రెడ్డి, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడు రహమాన్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బస్వరాజ్, సిపిఐ సీనియర్ నాయకులు వెంకటయ్య, సిపిఎం సీనియర్ నాయకులు కిల్లె గోపాల్, సిఐటియు జిల్లా కార్యదర్శి కురుమూర్తి, వీరాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

