గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యం: పేట కాంగ్రెస్ అధ్యక్షులు

కలం, నారాయణపేట: గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ (Narayanpet Congress) పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కే. ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్నారు. ఓబీసీ కమిటీల పునర్నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తులు అర్హులైన నాయకుల పేర్ల స్వీకరణ కార్యక్రమం శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ.. జిల్లా ఓబీసీ చైర్మన్ పదవికి దరఖాస్తులతో పాటు మండలాల ఓబీసీ అధ్యక్షుల నియామకాలు, టౌన్ ఓబీసీ అధ్యక్షులు, మండల, గ్రామ ఓబీసీ కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై దరఖాస్తుల స్వీకరించినట్లు తెలిపారు. పటిష్టమైన ఓబీసీ కమిటీలతో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తామన్నారు. జిల్లా ఓబీసీ చైర్మన్ శ్రీ గొల్ల కృష్ణయ్య, టీపీసీసీ పరిశీలకులు కోట్ల చంద్రయ్య తదితరులు హాజరయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>