గుండ్రపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తకు ఆర్థిక సాయం

కలం, మునుగోడు (చండూరు): నల్గొండ జిల్లా చండూరు మండలం గుండ్రపల్లి (Gundrapalli) గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కురుపాటి శ్రీను తల్లి కురుపాటి ఎమ్మెల్యే ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచి ఉజ్జిని ఉషా అనిల్ రావు, పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం వారికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి టేకుల వినోద్ రెడ్డి, వార్డు మెంబర్లు తీగల వెంకన్న, వడ్డమల్ల మధు, పెండ్యాల ఉపేందర్, దామెర అనిల్, కురుపాటి రాజు, కురుపాటి సాయిలు, కురుపాటి కృష్ణ, నక్క కృష్ణయ్య, క్రాంతి, నవీన్, కొమ్మనపల్లి శ్రీను, భూతరాజు శంకర్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>