పలు వివాహ వేడుకల్లో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

కలం, వనపర్తి: జిల్లా కేంద్రం పరిధిలోని పలు గ్రామాల్లో జరిగిన వివాహ, శుభకార్యాలకు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (Singireddy Niranjan Reddy) హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రేవల్లి గ్రామంలో బీఆర్‌ఎస్ నాయకుడు బోర్ల బీమయ్య కుమార్తె ప్రశాంతి వివాహ మహోత్సవానికి హాజరైన నిరంజన్‌రెడ్డి నూతన వధువుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బుద్ధారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు లచ్చిగౌడ్ సోదరుడు నాగరాజ్‌గౌడ్, రోజా దంపతుల కుమార్తె తులసి ప్రధాన వేడుకకు హాజరై ఆశీర్వదించారు. మాజీ మంత్రి వెంట మాజీ జడ్పీటీసీ బీమయ్య, శివరాం రెడ్డి, భాస్కర్‌రెడ్డి, సురేష్, శ్రీనివాస్‌రెడ్డి, రాంచంద్రయ్య, కురుమయ్యరెడ్డి, వెంకటేష్, సర్పంచ్ శేఖర్‌గౌడ్, వెంకటస్వామి, విజయ్‌గౌడ్, తిరుపతయ్య, వెంకటసాగర్ తదితర బీఆర్‌ఎస్ నాయకులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>