‘సర్’పై ఈసీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్ ప్రక్రియలో భాగంగా తుది ఓటర్ల జాబితా గడువు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కోరారు. ఈ మేరకు ఈసీకి మూడు పేజీల లేఖ రాశారు. వచ్చే నెల 16వ తేదీ నాటికి ఓటర్లు తమ అభ్యంతరాలు తెలిపే అవకాశం కల్పించారని వివరించారు. సెప్టెంబర్ 16వ తేదీతో అభ్యంతరాల గడువు ముగుస్తుందని, అక్టోబర్ 19వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితా కూడా ప్రకటిస్తామని ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారని గుర్తించారు.

అభ్యంతరాలు, క్లెయింల స్వీకరణ, పరిష్కారానికి ఇంత తక్కువ సమయం ఉండటం వలన అర్హులైన ఓటర్లకు అన్యాయం జరిగే అవకాశం ఉందని సీఎం రేవంత్ (Revanth Reddy) స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తుది ఓటర్ల జాబితా గడువును మరో నాలుగు వారాలకు పొడిగించాలని సూచించారు. తెలంగాణలో సమీప వచ్చే కొద్ది నెలల్లో ఎన్నికలు లేనందున, ఇలాంటి పొడిగింపు సమంజసమే అని వెల్లడించారు. తద్వారా, అర్హులైన ప్రతి వ్యక్తి తమ ఓటు హక్కును కోల్పోకుండా ఉండారని వివరించారు.

కనీసం రెండు సార్లు సభలు..

ఎన్నికల సంఘం (EC) ప్రకటించిన మాన్యువల్ ప్రకారం, ఓటర్ల జాబితాను ప్రతి గ్రామం, పట్టణాల్లో అయితే వార్డుల్లో ప్రదర్శించి సభ ద్వారా అవగాహన కల్పించాలని చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ సభను కనీసం రెండు సార్లు నిర్వహించేలా, వెంటనే అన్ని జిల్లాల ఎలక్టోరల్ ఆఫీసర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీని ద్వారా, ప్రతి గ్రామంలో అర్హులైన వారి ఓట్లు పోకుండా జాగ్రత్తలు చేపట్టవచ్చన్నారు.

Also Read : మేమంతా రాజీనామా చేస్తాం.. బీఆర్ఎస్ కౌన్సిలర్ల నిరసన

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>