అర్హులైన ప్రతి కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు: షబ్బీర్ అలీ

కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి నియోజకవర్గం బిక్నూర్ మండలం రామేశ్వరం పల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన స్మార్ట్ రేషన్ కార్డుల(Smart Ration Cards) పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరై అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ (Shabbir Ali) మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందించాలనే లక్ష్యంతో స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) జారీ ప్రక్రియ చేపట్టామని తెలిపారు. ఈ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు నిత్యావసర సరుకులు సులభంగా అందడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు అర్హత పొందే అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, మహిళా సాధికారత పథకాలు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని… పేదల ముఖంలో చిరునవ్వు చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రాణి రాజు, మాజీ డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, మాజీ డీసీసీబీ అధ్యక్షులు ఎడ్ల రాజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్, గ్రామ వీడీసీ అధ్యక్షులు సూర్యకాంత్, సొసైటీ చైర్మన్లు భీంరెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ లింబాద్రి, సర్పంచులు రేఖ, కృష్ణ రావు, లింగ రెడ్డి, సంతోష్, సీనియర్ నాయకులు విజయ్ గౌడ్, మహిపాల్, రాజబాబు, అంకం రాజు, యాదవ రెడ్డి, స్వామి, దయాకర్ రెడ్డి, పండ్ల రాజు, SC సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, యువజన కాంగ్రెడ్ మండల అధ్యక్షులు వెంకటేష్, డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, శ్రీకాంత్, కోటను స్వామి, రాకేష్, సతీష్, ధర్మయ్య, కిరణ్, సురేష్ పాత్రికేయ మిత్రులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Also Read : కాంగ్రెస్‌కు కడియం శ్రీహరి షాక్.. సంచలన డిమాండ్..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>