ఫీజుల బకాయిలపై నిర్మల్‌లో బీజేవైఎం పోరుబాట

కలం, నిర్మల్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement), స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన దీక్ష (BJYM Protest) చేపట్టారు. శనివారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట “ఫీజుల బకాయి.. బీజేపీ లడాయి” నినాదంతో చేపట్టిన ఈ దీక్షలో నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వాల వైఖరి కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతోందని మండిపడ్డారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు రావాల్సిన సుమారు రూ.15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బకాయిల చెల్లింపులో ప్రభుత్వం ఇంకా జాప్యం చేస్తే బీజేవైఎం (BJYM Protest) ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరారు.

Also Read : ప్రోటోకాల్ రగడ.. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>