కలం, వెబ్ డెస్క్ : నేపాల్లో సంభవించిన భారీ వరదలు, అకస్మాత్తుగా విరుచుకుపడిన ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా అనేక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ వరదల నేపథ్యంలో ఇన్ఫోసిస్ సంస్థ అనుబంధ విభాగమైన ‘ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్’ సీఈఓ లక్ష్మీనాథ్ గోపిశెట్టి (Lax Gopisetty) గల్లంతయ్యారు.
ఆయన పర్యటనకు ఇన్ఫోసిస్ (Infosys) అధికారిక పనులకు ఎటువంటి సంబంధం లేదని సంస్థ స్పష్టం చేసింది. లక్ష్మీనాథ్ గోపిశెట్టి భద్రత, క్షేమ సమాచారం తెలుసుకోవడానికే తమ మొదటి ప్రాధాన్యతని ఇన్ఫోసిస్ తెలిపింది. ఆయన జాడ కనిపెట్టేందుకు సంబంధిత ప్రభుత్వ, సహాయక ఏజెన్సీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ క్లిష్ట సమయంలో లక్ష్మీనాథ్ (Lax Gopisetty) కుటుంబానికి అండగా ఉంటామని, వారితో నిరంతరం టచ్లో ఉంటూ అవసరమైన సహాయ సహకారాలను అందిస్తున్నామని ఇన్ఫోసిస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. నేపాల్లో సంభవించిన ఈ విపత్తు వల్ల సంభవించిన ప్రాణనష్టం పట్ల కంపెనీ విచారం వ్యక్తం చేసింది.
Also Read : ఖర్గే వివాదం.. రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్!
Follow Us On : WhatsApp

