వైసీపీ హ‌యాంలో మ‌త మార్పిడులు.. చంద్ర‌బాబు సంచలన వ్యాఖ్యలు

క‌లం, వెబ్‌డెస్క్‌: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో ఉండాలంటే మ‌తం మారాల్సిందేన‌ని, ఆ పార్టీ నేత‌లు బ‌ల‌వంత‌పు మ‌త మార్పిడుల‌కు పాల్ప‌డ్డార‌ని సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అర‌కు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నిర్వ‌హించిన సంజీవ‌ని కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. వైసీపీ హ‌యాంలో హిందూ దేవాల‌యాల ప‌విత్ర‌త‌ను దెబ్బ తీశార‌ని, ఆల‌యాల‌పై దాడులు చేశార‌ని మండిప‌డ్డారు. ఓ మాజీ మంత్రి కోడ‌లిని మ‌తం మారాల‌ని ఒత్తిడి చేశార‌ని అన్నారు. ఆమె ఇటీవ‌ల బ‌హిరంగంగానే ఈ విష‌యాన్ని వెల్ల‌డించార‌ని తెలిపారు. ఆమెను ఇంట్లో పూజ‌లు కూడా చేసుకోనివ్వ‌లేద‌ని తెలిపారు.

వైసీపీ నేత‌లంతా క్రైస్త‌వాన్ని అనుస‌రిస్తూ బ‌య‌ట‌ హిందువులుగా చెలామ‌ణి అవుతున్నార‌ని సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) అన్నారు. అయితే వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రైనా, ఏ మ‌త‌మైనా అనుస‌రించ‌వ‌చ్చ‌ని, కానీ, ఇత‌ర మ‌తాల‌ను బ‌ల‌వంతంగా ఒక‌రిపై రుద్ద‌డం మంచిది కాద‌న్నారు. వైసీపీలో ఉండాలంటే మ‌తం ఒక ప్రాతిప‌దిక‌గా మార్చేశార‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ఈ కార‌ణంగానే కొంద‌రు నాయ‌కులు సైతం మ‌తం మారార‌ని, ఇలా బ‌ల‌వ‌వంతంగా మ‌తం మార్చ‌డం దుర్మార్గ‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read : కాఫీ తోటలు పెంచమని చెప్పింది నేనే : చంద్రబాబు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>