రోజ్ వాటర్ కోసం ఇక మార్కెట్‌కు వెళ్లొద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!

కలం, వెబ్ డెస్క్: ఈ రోజుల్లో యువత చర్మ సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. చర్మ సంరక్షణలో భాగంగా చాలామంది రోజ్ వాటర్‌ను కూడా ఉపయోగిస్తుంటారు. రోజ్ వాటర్ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా ముఖానికి నాచురల్ గ్లో ఇవ్వడానికి, చల్లదనాన్ని అందించడానికి కూడా రోజ్ వాటర్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అయితే ఈ రోజ్ వాటర్‌ను మార్కెట్లో కొనడానికి బదులుగా ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో (Homemade Rose Water) ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

2 నుంచి 3 తాజా గులాబీ రేకులు, 2 నుంచి 3 కప్పుల శుభ్రమైన నీరు

తయారు చేసుకునే విధానం

ముందుగా గులాబీ రేకులను శుభ్రంగా నీటితో కడగాలి. శుభ్రం చేసుకున్న గులాబీ రేకులను ఒక గిన్నెలో వేసి పూర్తిగా మునిగేంత వరకు నీరు పోయాలి. తర్వాత స్టవ్ పై పెట్టి మీడియం మంటపై వేడి చేయాలి. నీటిని మరీ ఎక్కువగా మరిగించకుండా మీడియం ఫ్లేమ్‌లో వేడిచేయాలి. కొద్దిసేపటి తర్వాత గులాబీ రేకుల రంగు, సువాసన నీటిలోకి వస్తాయి. గులాబీ రేకులు రంగును పూర్తిగా వదిలిన తర్వాత స్టవ్ ఆపేయాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత శుభ్రమైన గాజు సీసా లేదా స్ప్రే బాటిల్ లో పోసి ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవచ్చు. దీన్ని ఫేస్ టోనర్ లేదా ఫేస్ మిస్ట్‌గా ఉపయోగించవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>