హైద‌రాబాద్ మెట్రోలో సాంకేతిక స‌మ‌స్య‌లు!

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్ మెట్రో (Hyderabad Metro) లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింది. శ‌నివారం టికెట్లు తీసుకునేందుకు ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆన్ లైన్ సేవ‌లు పూర్తిగా నిలిచిపోవ‌డంతో పాటు క్యూఆర్ కోడ్‌ల‌ను స్కాన్ చేస్తే స్కాన‌ర్లు కూడా ప‌ని చేయ‌లేదు. దీంతో ప్ర‌యాణికులు టికెట్లు కొనేందుకు, స్టేష‌న్‌లోకి ఎంట‌ర్ అయ్యేందుకు స‌మ‌స్య‌లు ఎదురయ్యాయి.

ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వ‌ద్ద స్కాన‌ర్లు మొరాయించ‌డంతో ప్ర‌యాణికుల ర‌ద్దీ భారీగా పెరిగి క్యూలైన్లు బారులు తీరాయి. ఆఫీసుల ప‌ని వేళ‌ల్లో ఈ గంద‌ర‌గోళం త‌లెత్త‌డంతో ఉద్యోగులు, నిత్యం రాక‌పోక‌లు సాగించే ప్ర‌యాణికులు గ‌మ్య స్థానాల‌కు చేరుకోలేక అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారు. టెక్నీషియ‌న్స్ కొద్ది సేప‌టి త‌ర్వాత స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డంతో ప్ర‌యాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>