కలం, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో క్రైమ్ రేట్ తగ్గిందని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. సోమవారం ఆయన వార్షిక నివేదిక విడుదల చేశారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. మెస్సీ పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. మూడు విడతల పంచాయతీ ఎన్నికలను కూడా పకడ్బందీగా నిర్వహించామన్నారు.
మావోయిజం అంతం చేయడంలోనే తెలంగాణ పోలీస్ శాఖ తన వంతు కృషి చేసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని పేర్కొన్నారు. అందాల పోటీలు, గ్లోబల్ సమ్మిట్‌కు భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో 2.33 శాతం క్రైమ్ రేట్ తగ్గిందని శివధర్ రెడ్డి(DGP Shivadhar Reddy) చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా 7 లక్షల కేసులను పరిష్కరించామన్నారు. 3,885 మందికి శిక్షలు పడ్డాయని పేర్కొన్నారు.
Read Also: ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి
Follow Us On: Pinterest


