మళ్లీ పెరిగిన CNG ధరలు!

కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సీఎన్‌జీ ధరలు (CNG Price) పెరిగాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) సీఎన్‌జీ ధరను కేజీపై రూ.3.89 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన నూతన ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి.

ఈ పెంపుతో ఢిల్లీలో ఇదివరకు రూ.83.09గా ఉన్న కిలో సీఎన్‌జీ ధర ఇప్పుడు రూ.86.98కి చేరుకుంది. అలాగే నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘాజియాబాద్ ప్రాంతాల్లో కేజీ సీఎన్‌జీ ధర రూ.95.59గా నమోదు కాగా, గురుగ్రామ్‌లో రూ.92.01గా ఉంది. అంతర్జాతీయంగా ఎల్‌ఎన్‌జీ (LNG) దిగుమతి వ్యయం పెరగడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని ఐజీఎల్ స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>