కలం, నిజామాబాద్ బ్యూరో : కామారెడ్డి జిల్లా బాన్సువాడ (Banswada Accident) తాడ్కోల్ రోడ్డు చౌరస్తాలొ సిగ్నల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను వెనుక నుండి లారీ ఢీ కొట్టడంతో యూకేజి చదివే జైనబ్ ఫాతిమా అనే నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తండ్రి రఫీ తో పాటు ఇద్దరు కొడుకులు ఆర్హాన్, అయాన్ కు తీవ్ర గాయాలయ్యాయి.
వారిని బాన్సువాడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. స్కూల్ కు పిల్లలను తీసువెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. తల్లి తండ్రి రోదనలు చూసి అక్కడ ఉన్న వారు సైతం కంట తడి పెట్టుకున్నారు.

