ప్రతి అంగుళాన్ని గమనిస్తున్నాం.. ఇరాన్​ కు ట్రంప్​ వార్నింగ్​

కలం, వెబ్ డెస్క్​​ : హర్మూజ్​ జలసంధిలోని మందుపాతరలను అన్నింటినీ అమెరికా నౌకాదళం విజయవంతంగా తొలగించిందని డొనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ తెలిపారు. ట్రూత్​ సోషల్​ మీడియాలో ఆయన ఇరాన్​ ను హెచ్చరిస్తూ పోస్ట్​ పెట్టారు. హర్మూజ్ జలసంధిలోని అన్ని మైన్స్​ తొలగించామని.. కొత్త మందుపాతరలు అమర్చుతున్నట్లు గుర్తిస్తే ఆ నౌకలను ధ్వంసం చేస్తామని ఇరాన్​ కు ట్రంప్​ వార్నింగ్​ ఇచ్చారు.

అమెరికా స్పేస్ ఫోర్స్ ద్వారా జలమార్గంలోని ప్రతి అంగుళాన్ని గమనిస్తున్నామన్నారు. తాము దాడి చేసిన మూడు ఇరాన్ అణు కేంద్రాలపై కూడా అమెరికా బలగాలు నిఘా ఉంచుతున్నాయని ట్రంప్​ వెల్లడించారు. మైన్ల ఏర్పాటుపై జీరో టాలరెన్స్ విధానం అమలులో ఉందని తెలిపారు.

ఇరాన్​ తీవ్ర ఆర్థిక ఒడిదొడుకులు ఎదుర్కొంటోందన్నారు. సైన్యానికి జీతాలు చెల్లించలేని పరిస్థతికి దిగజారిందని ట్రంప్​ పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన నిరసనకారులను ఇరాన్​ హత్య చేస్తుందని ట్రంప్​ ఆరోపించారు. ఇది అత్యంత తీవ్రమైన మానవతా సంక్షోభం, దీనిని ఇప్పుడే ఆపాలి అని ట్రంప్ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>