కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలయింది. నవీన్ యాదవ్ (Naveen Yadav) ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన మాగంటి సునిత ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అఫిడవిట్ లో తప్పుడు వివరాలు ఇచ్చారని, అలాగే.. తనపై ఉన్న 7 క్రిమినల్ కేసులను అందులో పేర్కొనలేదని వెల్లడించింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills) ప్రచార సమయంలోనూ నవీన్ యాదవ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ సునీత పిటిషన్ లో పేర్కొన్నారు.


