వేగంగా సర్వాయి పాపన్న టూరిజం ప్రాజెక్ట్ పనులు: మంత్రి పొన్నం

కలం, కరీంనగర్: హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం సర్వాయిపేటలో నిర్మిస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్ట్ పనులను రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పరిశీలించారు. పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా సర్వాయిపేట గ్రామంలో పర్యటించిన మంత్రి.. విగ్రహ ఏర్పాటు, పరిసరాల అభివృద్ధికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.

త్వరలోనే సీఎం చేతుల మీదుగా..

సీఎం రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సర్వాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ టూరిజం ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి పొన్నం తెలిపారు. అందుకు అనుగుణంగా ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నామని, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మ్యూజియం పనులను కూడా మంత్రి పొన్నం పరిశీలించారు. మ్యూజియం భవనం ముందు ఫ్లోరింగ్, గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ పనులను చేపట్టి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. పాపన్న గౌడ్ చరిత్ర, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు పరిచయం చేసేలా ఈ టూరిజం ప్రాజెక్ట్‌ను అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>