జురెల్ బ్యాటింగ్ పై పూజారా, కైఫ్ ప్రశంసలు

క‌లం, వెబ్‌డెస్క్‌: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) 115 పరుగులతో నాటౌట్‌గా నిలిచి అద్భుత సెంచరీ బాదాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది. శ్రీలంక రెండో రోజు ఆట ముగిసేసరికి 8/2తో నిలిచింది. ఈ సందర్భంగా జురెల్ ఆటతీరును టీమిండియా మాజీ ఆటగాళ్లు చేతేశ్వర్ పూజారా (Cheteshwar Pujara), మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) కొనియాడారు.పూజారా మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్ తర్వాత ఫాస్ట్ బౌలింగ్‌ను బెస్ట్‌గా ఆడేది జురెల్లేనని అన్నాడు. జురెల్ ఫుట్‌వర్క్ చాలా బాగుందని, ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్‌లలో అద్భుత షాట్లు ఆడతాడని చెప్పాడు.

యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని, టెస్టుల్లో సుదీర్ఘ కాలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గా కొనసాగే సత్తా అతనికుందని స్పష్టం చేశాడు.మరోవైపు మహమ్మద్ కైఫ్ మాట్లాడుతూ.. జురెల్ కొట్టిన ప్రతీ షాట్ బ్యాట్ మధ్యలోనే తగిలిందని ప్రశంసించాడు. స్పిన్‌ను కూడా అద్భుతంగా ఆడాడని పేర్కొన్నాడు. గాలె టెస్టులో ఒత్తిడిలో ఉన్నప్పటికీ నిలకడగా రాణించాడని తెలిపాడు.జురెల్ ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. చివరికి రిస్కీ సింగిల్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>