నల్లగొండలో పీడీఎస్‌యూ శిక్షణ తరగతులు

కలం, నిజామాబాద్ బ్యూరో: సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నల్లగొండలో నిర్వహించనున్న పీడీఎస్‌యూ రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పీడీఎస్‌యూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, నగర అధ్యక్షుడు సిర్రం పవన్ కుమార్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పీడీఎస్‌యూ నిజామాబాద్ (Nizamabad PDSU) నగర కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ వద్ద శిక్షణ తరగతులకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో రాజకీయ, సామాజిక అవగాహన పెంపొందించడంతో పాటు సమకాలీన అంశాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, పీడీఎస్‌యూ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని వారు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>