కలం, వెబ్ డెస్క్ : చెక్ పవర్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధుల విడుదలకు సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలు (Sarpanch Cheque Power) తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు సంతకం చేసిన చెక్కులకు మాత్రమే చెల్లింపులు చేయాలని ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
గ్రామ పంచాయతీ నిధుల వినియోగంలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీ నిధులకు సంబంధించి జారీ చేసే చెక్కులపై సర్పంచ్(Sarpanch Cheque Power) తో పాటు ఉప సర్పంచ్ ఇద్దరి సంతకాలు ఉంటేనే బ్యాంకులు చెల్లింపులు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
పంచాయతీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అలాగే పాలనలో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులు ఈ నిబంధన అమలయ్యేలా చూడాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశాలు జారీ చేసింది.
Read Also: రామాయణం, భగవద్గీత చెప్తా.. అన్వేష్ కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp


