ఏసీబీకి చిక్కిన ఆలేరు ఆర్ఐ

కలం, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు (Aleru) తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వారసత్వ భూ బదిలీ ప్రక్రియ కోసం లంచం తీసుకుంటుండగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) పూర్ణచంద్రరావు, గ్రామ పంచాయతీ రెవెన్యూ అధికారి (జీపీవో) అహ్మద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు వివరాలు వెల్లడించారు. కొలనుపాక రెవెన్యూ పరిధిలోని ధర్మారెడ్డి గూడెం గ్రామానికి చెందిన బుడిగ మహేష్‌ తన తండ్రి మరణానంతరం సంక్రమించిన భూమిని తన పేరు మీద మార్చుకోవడానికి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించారు.

రూ.20 వేలు డిమాండ్ చేయడంతో..

జీపీవో అహ్మద్, ఆర్‌ఐ పూర్ణచంద్రరావు రూ.20వేలు లంచం డిమాండ్ చేశారు. అంత మొత్తాన్ని చెల్లించలేనని చెప్పడంతో చివరికి రూ.14 వేలు ఇవ్వాలని తేల్చి చెప్పారు. అధికారుల వేధింపులను తట్టుకోలేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో బాధితుడి నుంచి రూ.14 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి ఇద్దరిని పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో కీలక పత్రాలను పరిశీలిస్తూ విచారిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు ప్రజలకు సూచించారు.

Also Read : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>