ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత కు స్వల్ప గాయం..!

కలం, వెబ్ డెస్క్: తిరుపతిలో జరుగుతున్న అమరావతి ఛాంపియన్‌షిప్ ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత‌(Vangalapudi Anitha)కు స్వల్ప గాయమైంది. ఈ వేడుకను అట్టహాసంగా నిర్వహించడానికి నిర్వాహకులు అక్కడే ఓ డ్రోన్ ను గాల్లోకి ఎగరవేశారు. ఈ సమయంలో అకస్మాత్తుగా డ్రోన్ బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోవడంతో అది అదుపుతప్పి కిందకి పడిపోయింది.

ఈ క్రమంలోనే అక్కడే ఉన్న హోంమంత్రి అనిత చేతికి డ్రోన్ తగిలింది. దీంతో ఆమెకు స్వల్ప గాయమైంది. ఈ అనుహ్య ఘటనతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే అప్రతమత్తమైన పోలీసులు ఆ డ్రోన్‌ను సీజ్ చేశారు. వైద్యులు హోంమంత్రికి బ్యాండేజ్ కట్టారు. ఆ తర్వాత ఆమె కార్యక్రమంలో పాల్గొనడంతో అందరూ ఊపిరీ పీల్చుకున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>