రేవంత్‌తో భేటీ కానున్న ఎమ్మెల్యేలు.. కొండా సురేఖ ఇష్యూపై చర్చ!

కలం, వెబ్ డెస్క్: విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్న కొండా సురేఖ వ్యవహారంపై రేవంత్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, సీఎం విదేశీ పర్యటన, ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుటుంబ వ్యవహారం, పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న క్రమశిక్షణ ఉల్లంఘన అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

పార్టీ నేతల మధ్య సమన్వయం, క్రమశిక్షణ పాటించేలా తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రితో తమ అభిప్రాయాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో పార్టీ అంతర్గత అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>