దేశంలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ముగ్గురు అనుమానితులు అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: పంజాబ్, చండీగఢ్‌లో (Punjab-Chandigarh) భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. చండీగఢ్ సెక్టార్-43 బస్‌స్టాండ్ సమీపంలో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో లవ్ ప్రీత్ సింగ్ (19), జషన్ ప్రీత్ సింగ్ అలియాస్ జషన్ దీప్ (21), ప్రభ్ ప్రీత్ సింగ్ అలియాస్ ప్రభ్ (19) ఉన్నారు. వీరిలో ఇద్దరు తరన్‌తారన్‌కు, మరొకరు అమృత్‌సర్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్‌కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది సత్నామ్ సట్టాతో వీరికి సంబంధాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పంజాబ్, చండీగఢ్‌లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read : కొండా సురేఖపై వేటు తప్పదా?.. గాంధీ‌భవన్‌లో తర్జన భర్జనలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>