epaper
Friday, January 16, 2026
spot_img
epaper

న్యూ ఇయర్​ వేడుకలు.. ఓఆర్​ఆర్​ పైకి ఆ వాహనాలకు నో ఎంట్రీ

కలం, వెబ్​ డెస్క్​ : నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా సైబరాబాద్ పరిధిలో పోలీసులు (Cyberabad Police) ఆంక్షలు విధించారు. 31 రాత్రి 10.30 నుంచి 2 గంటల వరకు అవుటర్​ రింగ్​ రోడ్డుపై రవాణా వాహనాలను నిషేధించారు. ఈ మేరకు సైబరాబాద్​ పోలీసు కమిషన్​ నోటిఫికేషన్​ రిలీజ్ చేశారు.

ఓఆర్​ఆర్​ పరిధిలో నిర్మాణ, శిథిలాలను రవాణా చేసే వాహనాలకు అనుమతి లేదని ప్రకటించారు. ఈ ఆంక్షలు కేవలం డిసెంబర్​ 31 రాత్రి 10.30 నుంచి 2 గంటల వరకు మాత్రమే ఉంటుందని కమిషనర్​ పేర్కొన్నారు.

నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి భద్రత, ట్రాఫిక్​ ను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్​ అవినాష్​ మోహంతి తెలిపారు. ఈ ఆంక్షలు హైదరాబాద్​ శివారు ప్రాంతాలు, ముఖ్యంగా ఐటీ కారిడార్​ పై ప్రధానంగా అమలు కానున్నాయి.

Read Also: జెలెన్​ స్కీకి పుతిన్ క్రిస్మస్​ కానుక…​

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>