కలం, వెబ్ డెస్క్: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ (NZ ODI Series) ఆడటానికి భారత్ రెడీ అవుతోంది. ఈ క్రమంలో టీమిండియా మేనేజ్‌మెంట్ కీలక డెసిషన్ తీసుకుంది. ఈ మూడు వన్డేల సిరీస్ నుంచి బుమ్రా, హార్దిక్‌ను తప్పించాలని ఫిక్స్ అయింది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ, బీసీసీఐ ఇదే ప్లాన్‌లో ఉందని సన్నిహిత వర్గాల నుంచి అందుతున్నా సమాచారం.
అంతర్జాతీయ మ్యాచ్లేని సమయంలో దేశవాళీ క్రికెట్ కొనసాగే నేపథ్యంలో, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా విజయ్ హజారే ట్రోఫీలో ఆడే అవకాశాలు కలిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ మొదటి రెండు మ్యాచ్‌లు ఆడినవి. కోహ్లీ జనవరి 6న రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. బీసీసీఐ ఈ విధంగా జట్టుకు పరిమిత సీజనల్ ప్లేయర్లను విశ్రాంతి ఇస్తూ, ప్రధాన ఆటగాళ్లను గ్లోబల్ టోర్నీలోకి సజావుగా సిద్ధం చేసేందుకు ముందడుగు వేసినట్లే చెప్పవచ్చు.
Read Also: అదరగొట్టిన అభిషేక్.. 60 నిమిషాల్లో 45 సిక్సర్లు
Follow Us On: Instagram


