కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన పుట్టిన రోజు వేడుకలు మహారాష్ట్రలో నిర్వహించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. మహారాష్ట్రలోని ఎమ్మెల్సీ విక్రమ్ కాకడే (Vikram Kakade) నివాసంలో చిరంజీవి బర్త్‌డే వేడులకు చేసుకున్నారు. ఈ వేడుకలకు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్, నటుడు శ్రీకాంత్, రాజా రవీంద్ర తదితరులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శనివారం సాయంత్రం ఈ వేడుకలు చేసుకొని మళ్లీ రాత్రి లోపు చిరంజీవి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైనట్లు తెలుస్తోంది. దీంతో మహారాష్ట్ర ఎమ్మెల్సీతో చిరంజీవి సాన్నిహిత్యంపై నెటిజన్లు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

