కొండా సురేఖ లేఖ‌పై వాకిటి శ్రీహ‌రి రియాక్ష‌న్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: త‌న‌పై కుట్ర జ‌రుగుతోందంటూ కాంగ్రెస్ పార్టీ క్ర‌మ శిక్ష‌ణ క‌మిటీ చైర్మ‌న్ మ‌ల్లు ర‌వికి కొండా సురేఖ (Konda Surekha) రాసిన లేఖ‌పై మంత్రి వాకిటి శ్రీహ‌రి (Vakiti Srihari) స్పందించారు. కొండా సురేఖ‌పై కుట్ర‌లు చేయాల్సిన అవ‌స‌రం పార్టీలో ఎవ‌రికీ లేద‌ని అన్నారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కొండా సురేఖ వ్య‌వ‌హారంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొండా సురేఖ అయినా, చిన్నారెడ్డి అయినా పార్టీకి డ్యామేజ్ కానంత వ‌ర‌కే నాయ‌కుల‌ని అన్నారు. పార్టీ ఉంటేనే నాయ‌కులు ఉంటార‌ని, లేక‌పోతే ఎవ‌రూ ఉండ‌ర‌ని తెలిపారు.

పెద్ద‌రికం చేసేట‌ప్పుడు భూదేవికి ఉన్నంత‌ ఓపిక‌ ఉండాల‌ని వాకిటి శ్రీహ‌రి సూచించారు. పార్టీకి న‌ష్టం జ‌రిగితే పీసీసీ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ సీఎం త్వ‌ర‌లో రాష్ట్రానికి వ‌స్తార‌ని, ఆయ‌న వ‌చ్చాక స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>