తెలంగాణలో జనసేన దూకుడు.. పట్టభద్రుల MLC అభ్యర్థి ఫిక్స్!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో జనసేన (Janasena) పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎన్నికలు ఏవైనా సరే.. ఫలితాలతో సంబంధం లేకుండా పోటీచేస్తూ ఓటు బ్యాంక్ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో తెలంగాణలో జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి దిగబోతోంది. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం–నల్లగొండ–వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు (Dr Gadala Srinivasa Rao) పేరును పార్టీ ముందస్తుగా ప్రకటించింది.

ప్రస్తుతం డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, అధికార ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నతస్థాయిలో సేవలందించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైద్య ఆరోగ్య రంగంలో ఆయన సేవలు అందించారు. జనసేన పార్టీ జాతీయ కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ గడల శ్రీనివాసరావు పేరును.. పార్టీ జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు.

డాక్టర్ గడల శ్రీనివాసరావు అభ్యర్థిత్వానికి పవన్ కళ్యాణ్ సుముఖత వ్యక్తం చేయడంతో, ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు (Gadala Srinivasa Rao) పేరును జనసేన పార్టీ ముందస్తుగా ప్రకటించింది. పట్టభద్రులు, ఉద్యోగులు, యువత, విద్యావంతులు, మేధావుల సమస్యలను శాసన మండలి వేదికగా బలంగా వినిపిస్తానని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం–నల్లగొండ–వరంగల్ జిల్లాల పట్టభద్రుల మద్దతుతో ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుని తెలంగాణలో జనసేన పార్టీ సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.

Also Read : కాంగ్రెస్ పార్టీలో పాత వారికే పెద్దపీట.. 100 సీట్లే లక్ష్యం: టీపీసీసీ చీఫ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>