ఫీజు బకాయిలపై బిగ్‌ఫైట్: బీజేపీ సంచలన నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలు, నిర్లక్ష్య వైఖరి వల్ల తెలంగాణలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుదేలైందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్. గౌతమ్ రావు విమర్శించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువులకు ఎంతో కీలకమైన సుమారు రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకుండా తొక్కిపెట్టిందని ఆయన ఆరోపించారు. దీని ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది విద్యార్థుల జీవితాలు, వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విద్యా వ్యతిరేక తీరును ఖండిస్తూ, 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం బీజేపీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఫీజు బకాయిల విడుదల డిమాండ్‌తో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు (Ramchander Rao) ఆగస్టు 24, సోమవారం ఉదయం 10:00 గంటల నుండి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టనున్నారని తెలిపారు. ఈ దీక్ష ఆగస్టు 24, 25 తేదీలలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కాలేజీల్లో సర్టిఫికెట్లు చిక్కుకుపోయి, పైచదువులు ఆగిపోయి, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్న యువత ఆవేదనను చూసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌతమ్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి, ఆ రూ.15,000 కోట్ల బకాయిలను విడుదల చేయించేవరకు ఈ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>