కలం, వెబ్డెస్క్: దివ్యాంగుల (Disabled) కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్నా మ్యారేజ్ ఇన్సెంటివ్ స్కీమ్ (దివ్యాంగుల వివాహ కానుక) కింద రూ.లక్ష ఇవ్వనుంది(Marriage Scheme). ఈ మేరకు తెలంగాణ దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్ల సంక్షేమ విభాగం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దివ్యాంగులను సాధారణ వ్యక్తులు పెళ్లి చేసుకునేలా ప్రోత్సహించేందుకు గాను 2012లో ఈ పథకం తెచ్చారు. ఒక సాధారణ వ్యక్తి, మరొకరు దివ్యాంగులు అయితేనే ఈ పథకం వర్తించేంది.
ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే వర్తించేది కాదు. ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకున్నా ఈ పథకం(Marriage Scheme) వర్తిస్తుందని ఇటీవల ప్రకటించింది. దీని అమలులో భాగంగా ప్రస్తుతం అధికారిక ప్రకటన విడుదలైంది. అర్హులైన జంటలు ఆన్లైన్లో http://epass.telangana.gov.in. వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పెళ్లి అయిన ఏడాదిలోగానే దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. అలాగే వధూవరులిద్దరూ తెలంగాణ వాళ్లై ఉండాలి. ప్రభుత్వం జారీ చేసిన దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం ఉండాలి. వధువుకు కనీసం 18, వరుడికి కనీసం 21 సంవత్సాలు నిండి ఉండాలి.
Read Also: రేవంత్, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Follow Us On: Pinterest


