కలం, కరీంనగర్ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కొండగట్టుకు రాబోతున్నారు. జనవరి 3న అంజన్నను దర్శించుకుంటారు. అలాగే టీటీడీ నిధులతో నిర్మిస్తున్న సత్రాలు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. రూ.35 కోట్లతో కొండగట్టులో (Kondagattu) అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో పవన్ కల్యాణ్ వారాహి పూజ కోసం వచ్చినప్పుడు కొండగట్టు అభివృద్ధికి సహకరించాలని ఆలయ నిర్వాహకులు కోరిన విషయం తెలిసిందే. అప్పుడు హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. టీటీడీ నిధులతో ఆ హామీని పూర్తి చేస్తున్నారు. ఒకేసారి 2వేలమంది మాల విరమణ చేసేలా సత్రాలు, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన బిల్డింగును నిర్మిస్తున్నారు.
Read Also: ఏపీ సలహాదారుగా మంతెన సత్యనారాయణ రాజు
Follow Us On: Instagram


