మంత్రి కొండా సురేఖ సంచలన లేఖ

కలం, వెబ్ డెస్క్: దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మరో సంచలన లేఖ రాశారు. తనతో పాటు కుటుంబ సభ్యులను కొందరు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిదులు, నాయకులు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ.. అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికి రాసిన లేఖలో కీలక విషయాలు వెల్లడించారు.

తనపై కమిటీ విచారణ ఇంకా కొనసాగుతుండగానే.. సామూహికంగా మాటల దాడి చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. బహిరంగంగా విమర్శలు చేయడం, రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, తనపై చర్యలు తీసుకోవాలని మీడియా సమావేశాల్లో డిమాండ్ చేయడం సరికాదన్నారు. క్రమ శిక్షణ కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసేలా ప్రయత్నం జరుగుతోందా..? అనే అంశాన్ని కూడా పరిశీలించాలని లేఖలో కోరారు.

పార్టీ నాయకత్వం మౌనం ఎందుకు..?.

పార్టీ క్రమశిక్షణపై తనకు పూర్తి గౌరవం ఉందని మంత్రి కొండా సురేఖ లేఖలో స్పష్టం చేశారు. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన తనపై కొందరు వ్యక్తులు తీవ్ర స్థాయిలో మాటల దాడి చేస్తున్నా.. పార్టీ నాయకత్వం మౌనంగా ఉండటం తనను ఆందోళనకు గురి చేస్తోందన్నారు. వీరి వెనుక ఉద్దేశాలను కూడా వెంటనే పరిశీలించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి ఉన్న పార్టీ అని వివరించారు. అలాంటి విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తులపై క్రమ శిక్షణ కమిటీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>