కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీలో లైన్ ఎవరూ దాటినా చర్యలు తప్పవని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. కొండా సుస్మిత పార్టీ లైన్ దాటి ఆరోపణలు చేశారని తెలిపారు. గతంలో అనిరుధ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేసినా.. పార్టీ లైన్ దాటలేదని వివరించారు. కొండా సురేఖపై కఠిన చర్యలే తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న వేళ పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే క్రమ శిక్షణ కమిటీ తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసుకి కొండా సురేఖ (Konda Surekha) వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ లండన్ పర్యటన నుంచి వచ్చిన తరువాత ఆయనతో భేటీ అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే అందుకు ముఖ్యమంత్రి అంగీకరిస్తారా.. లేదా.. అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read : ఆ రెండు భేటీలు అడ్డంకిగా మారాయా? అందుకే సీఎంకు పర్మిషన్ ఇవ్వలేదా!
Follow Us On: X(Twitter)

