కలం, వెబ్ డెస్క్ : అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎ.కోడూరులో నిర్వహించిన స్వచ్ఛాంద్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు (CM Chandrababu) చిన్నారులకు కీలక సందేశం ఇచ్చారు. పిల్లలు చదువుకోవడంతో పాటు స్పోర్ట్స్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. పిల్లలు చదువుకోవాలి, అలాగే ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆడుకోవాలని చెప్పారు. అందుకే కూటమి ప్రభుత్వం చదువుకు సమానంగా స్పోర్ట్స్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించారు.
మరోవైపు సెప్టెంబర్ తొలివారంలోనే అనకాపల్లికి గోదావరి నీళ్లు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత విశాఖకు కూడా గోదావరి నీళ్లు తీసుకెళతామని అన్నారు.ప్రతి గ్రామం జీరో వేస్ట్ గ్రామంగా మారాలని ఆకాంక్షించిన సీఎం.. చెత్త నుంచి గ్యాస్, ఎరువుల తయారీ జరగుతుందని చెప్పారు. ఈ క్రమంలోనే రాజకీయ చెత్తను కూడా ప్రజలు కడిగేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా ప్రజలే చూడాలన్నారు.
విధ్వంసాలనే నమ్ముకున్న గొడ్డలి పార్టీ
ప్రతిపక్ష వైసీపీపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) మండిపడ్డారు. గొడ్డలి పార్టీ విధ్వంసాలనే నమ్ముకుందని ఫైర్ అయ్యారు. మెగా డీఎస్సీపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని ఆరోపించారు. మెగా డీఎస్సీని అడ్డుకోవడానికి 300 పిటిషన్లు వేశారని చెప్పారు. డీఎస్సీలో ఒక్క శాతం కూడా అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. అయితే వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 మూల్యాంకనంలో భారీగా అవతవకలు జరిగాయని పేర్కొన్నారు. ప్లంబర్లు, అటెండర్లతో పేపర్లుదిద్దించారని ఫైర్ అయ్యారు.
టీడీపీకి కార్యకర్తే అధినేత
స్వచ్ఛాంద్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం అనంతరం అనకాపల్లి జిల్లా కార్యకర్తలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. టీడీపీకి కార్యకర్తే అధినేత అని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలతో మమేకం అవ్వడం తన అదృష్టం అని చెప్పారు.
Also Read : ఆ రెండు భేటీలు అడ్డంకిగా మారాయా? అందుకే సీఎంకు పర్మిషన్ ఇవ్వలేదా!
Follow Us On: Instagram

