కలం, వెబ్ డెస్క్ : జెన్ జీ.. భారత దేశంలో ప్రస్తుతం ఈ పదం మార్మోగుతోంది. సీజేపీ నిరసనలతో ఒక్కసారిగా జెన్ జీ యువతరం దేశవ్యాప్తంగా ప్రభావం చూపించారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు జెన్ జీ మంత్రం జపిస్తున్నాయి. నీట్ నిరసనల సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ జెన్ జీలను ఆకట్టుకునేందుకు ఏకంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్ ద్వారా వీడియో విడుదల చేశారు. తాజాగా జెన్ జీ ల కోసం స్పెషల్ టీమ్ (BJP Special Team) ఏర్పాటు చేస్తూ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.
2029 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గం శనివారం ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో బీజేపీ నేతలు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. వీటిలో ప్రధానంగా జెన్ జీ ల కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. యువతరాన్ని ఆకట్టుకునేందుకు బీజేపీ స్పెషల్ టీమ్ (BJP Special Team) ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నితిన్ నబీన్, స్మృతి ఇరానీ, వినోద్ తావ్డే, హర్ష సాంగ్వీ సహా పలువురు నేతలు ఉన్నారు. అలాగే, జెన్ జీ యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ నిర్ణయం తీసుకుంది.
వందేమాతరంపై బీజేపీ కీలక తీర్మానం
వందేమాతరం గేయంపై బీజేపీ జాతీయ కార్యవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిన తీర్మానాన్ని బీజేపీ నేతలు ఖండించారు. తొలి 2 చరణాలకే వందేమాతరం గేయాన్ని పరిమితి చేస్తూ సీడబ్ల్యూ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి 6 చరణాల గౌరవాన్ని కాపాడతామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. వందేమాతరం గౌరవ ప్రతిష్ఠలను కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే, 2026 పార్లమెంట్ చట్టాన్ని బీజేపీ సమర్థించింది.
Also Read : ఆ రెండు భేటీలు అడ్డంకిగా మారాయా? అందుకే సీఎంకు పర్మిషన్ ఇవ్వలేదా!
Follow Us On: X(Twitter)

