వేములవాడ ఘటన.. పోలీసులను ఆశ్రయించిన మాధురి రాథోడ్!

కలం, వెబ్ డెస్క్ : రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలోని రెడ్డి భవన్‌లో ఈ నెల 19న తనపై దాడి జరిగిందని ప్రముఖ ఫోక్‌ సాంగ్స్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్ (Madhuri Rathod) పోలీసులను ఆశ్రయించారు. ఈశ్వర్ సాయి సతీమణి శరణ్య తనను అసభ్యకరమైన భాషతో దూషిస్తూ అకారణంగా దాడికి పాల్పడ్డారని, తన పరువుకు భంగం కలిగించారని వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వీడియోలు తీసి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, థ్రెడ్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేస్తూ తన ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ప్రచారం చేశారని మాధురి రాథోడ్ ఆరోపించారు. అంతేకాకుండా తన వద్ద ఉన్న రూ.50 వేల విలువైన ఐఫోన్‌ను కూడా లాక్కున్నారని, కొన్ని మీడియా సంస్థలు కూడా తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగేలా కథనాలను ప్రసారం చేశాయని పేర్కొన్నారు.

తనపై ప్రత్యక్షంగా దాడి చేసిన వారితో పాటు సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు ప్రచారం సాగించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు సంబంధిత మీడియా సంస్థలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>