కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా సోన్ (Soan) మండల కేంద్రానికి చెందిన దండుగుల గంగయ్య ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అనారోగ్యంతో మృతి చెందారు. రెండు రోజుల కిందట ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో గంగయ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, మండల బీజేపీ నాయకుల ద్వారా బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విదేశాంగ శాఖ అధికారులతో పాటు ఎన్ఆర్ఐ సెల్ అధికారులతో మాట్లాడారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఏలేటి మహేశ్వర్రెడ్డి భరోసా ఇచ్చినట్లు పార్టీ నాయకులు తెలిపారు.

