నిర్మల్ జిల్లా వ్యవసాయ అధికారిపై వేటు

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్‌‌పై వేటు పడింది. ఆయన్ను వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ భవేశ్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా అంజి ప్రసాద్ పనితీరుపై కలెక్టర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వివిధ నివేదికలను పరిశీలించిన అనంతరం సరెండర్ చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు అంజి ప్రసాద్ హైదరాబాద్‌‌లోని కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా ఖానాపూర్ ఏడీఏ సుజాతకు బాధ్యతలు అప్పగించారు. అయితే అంజి ప్రసాద్‌‌ను సరెండర్ చేయడానికి కారణాలపై అధికారికంగా ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>