OYO హోటళ్లపై పోలీసులు దాడులు.. అమ్మాయిలు, అబ్బాయిలు అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ఓయో హోటళ్లు (OYO Hotels) నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నాయి. పోలీసులు రెగ్యులర్‌గా తనిఖీలు చేస్తున్నా, హోటళ్ల నిర్వాహకుల తీరు మారడం లేదు. అసాంఘిక కార్యక్రమాలు, చట్ట విరుద్దమైన కార్యాకలాపాలు జరుగుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కూకట్‌పల్లి పరిధిలోని పలు ఓయో హోటళ్లపై దాడులు నిర్వహించారు.

ఆగస్టు 18న పోలీసులు అల్లూరి ట్రేడ్ కాంప్లెక్స్‌లోని రెండు OYO హోటళ్లలో తనిఖీలు చేశారు. 12 మందిని గుర్తించి, 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో అబ్బాయితోపాటు అమ్మాయిలున్నారు. 7 స్మార్ట్‌ఫోన్లు, 6 కండోమ్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హోటల్ యజమాని పరారయ్యాడు. చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. కొంతమంది ముఠా విదేశీ, ఢిల్లీ నుంచి అమ్మాయిలను హైదరాబాద్‌కు రప్పించి, వారితో వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం అందుతుండటంతో పోలీసులు తరచుగా ఓయో హోటళ్ల(OYO Hotels)పై దాడులు చేస్తున్నారు.

Also Read : సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దుపై కేంద్రం స్పష్టత..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>