epaper
Friday, January 16, 2026
spot_img
epaper

AP క్యాబినెట్ భేటీ.. కన్నీటిపర్యంతమైన మంత్రి

కలం, వెబ్​ డెస్క్​ : ఏపీ క్యాబినెట్​ సమావేశం వేళ మంత్రి మండిపల్లి రాంప్రసాద్​ రెడ్డి (Ramprasad Reddy) కన్నీటి పర్యంతమయ్యారు. రాయచోటి నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లా నుంచి వేరు చేయడంపై ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నేడు జరిగిన క్యాబినెట్​ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. అనంతరం బయటకు వచ్చిన రాంప్రసాద్​ రెడ్డి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు.

అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పును వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ మార్పు వల్ల ప్రజల్లో ఆందోళన నెలకొంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు మంత్రి రాంప్రసాద్​ ను ఓదార్చారు. రాయచోటిని మార్చకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ముఖ్యమంత్రి Ramprasad Reddy కి వివరించారు. నియోజకవర్గం అభివృద్ధిని తానే స్వయంగా చూసుకుంటానని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​ లో 26 జిల్లాలు ఉండగా, కొత్తగా మదనపల్లె, పోలవరం, మార్కాపురం జిల్లాలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మార్పుల్లో భాగంగానే అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మరో జిల్లాకు మార్చనున్నారు. మరోవైపు రాయచోటిని మార్చడంపై నియోజకవర్గంలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

Read Also: ఏపీ జిల్లాల‌ పునర్విభజనకు కేబినెట్ ఆమోదం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>