కలం, వెబ్‌డెస్క్: పాలమూరు–రంగారెడ్డి (Palamuru Project) పై బీఆర్ఎస్ నేతలు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని, ప్రజలను మభ్యపెడుతున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మండిపడ్డారు. ’మీ చేతకానితనాన్ని మాపై రుద్దవద్దు’ అని బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. సోమవారం విలేకరులతో మంత్రి చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే ‘బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డిని 90 టీఎంసీలకు, రూ.65వేల కోట్లతో ప్రతిపాదించింది. రూ.35 వేల కోట్ల అంచనాతో ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. డీపీఆర్ పంపడానికే ఏడేళ్లు తీసుకున్నారు. ఆలోగా రూ.21వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ, దిగిపోయే నాటికి కేవలం రూ.27వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 35 శాతం ఖర్చు చేసి.. 80 శాతం చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. అలాగే ప్రాజెక్టులో 45 టీఎంసీ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీ గోదావరి డైవర్షన్ అని వాడారు.
దానిపైనే మేము ముందుకు వెళ్తున్నాం. వాళ్లు ఇచ్చిన జీవోనే ప్రస్తావిస్తూ లేఖ రాశాం. మొదట మాకు నికరంగా ఉన్న 45 టీఎంసీ మైనర్ ఇరిగేషన్‌ను, ఫేజ్–1 కింద ఇన్షియల్‌గా చేయమని కోరాం. మా హయాంలో రెండేళ్లలోనే ప్రాజెక్టుకు రూ.7వేల కోట్లు ఖర్చు చేశాం. ఆయకట్టు కాల్వలకు భూసేకరణ చేయాలంటే మొత్తం కలిపి రూ.70 వేల కోట్లు అవుతుంది. బీఆర్ఎస్ హయాంలో ఒక్కటే పంపు పెడితే.. మేము వచ్చాక 11 మోటార్లు పెట్టాం. కానీ, ఉమ్మడి పాలమూరు, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు అన్యాయం చేస్తున్నామంటూ బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. హరీష్ రావును చూసి.. గోబెల్స్ కూడా సిగ్గుతో తలదించుకుంటాడు.
పాలమూరుపై ఎందుకంత కక్ష..:
మీరు పదేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. కాళేశ్వరానికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు. కానీ, పాలమూరు (Palamuru Project) కు మాత్రం రూ.27వేల కోట్లే ఖర్చు పెట్టారు. పాలమూరును రెండు టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీకి కుదించారు. కాళేశ్వరాన్ని మాత్రం రోజుకు రెండు నుంచి.. మూడు టీఎంసీలకు పెంచారు. సీఈ విజయ్ భాస్కర్ రెడ్డికి స్వయంగా.. పాలమూరు పనులు స్లో చేయాలని చెప్పారు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేవరకు కృష్ణాలో 299 టీఎంసీలకు కట్టుబడి ఉంటామని అపెక్స్ కౌన్సిల్లో ఒప్పుకున్నారు. మీకు పాలమూరు మీద ఎందుకు అంత వివక్ష? మేము మాత్రం ప్రాజెక్టు పూర్తి చేసి పాలమూరుకు నీరు అందిస్తాం. ప్రాజెక్టు పరిధిలోని నార్లపూర్, ఏదుల లింక్ పనులు కూడా ఆపేశారు. 2 వేల కోట్లతో ఖర్చు చేస్తే పూర్తయ్యే ఎస్ఎల్బీసీ విషయంలోనూ నిర్లక్ష్యం చేశారు. కల్వకుర్తికి రూ.900 కోట్లు ఖర్చు చేస్తే పూర్తి అయ్యేది. కానీ చేయలేదు’ అని బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.
Read Also: ‘పాలమూరు’పై మీ చేతకానితనాన్ని మాపై రుద్దవద్దు : ఉత్తమ్‌కుమార్ రెడ్డి
Follow Us On: Instagram


