కలం, నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం చిట్యాల్ (Chityal) గ్రామంలోని రైతు వేదికలో గురువారం జాతీయ పసుపు బోర్డు (National Turmeric Board) ఆధ్వర్యంలో రైతులకు పసుపు నాణ్యత మెరుగుదలపై (Quality Turmeric) ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపు సాగులో నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పంట నాణ్యతను పెంచే పద్ధతులు, శాస్త్రీయ విధానంలో పసుపు సాగు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.
పంటలో నాణ్యత పెంచడం ద్వారా మార్కెట్లో మంచి డిమాండ్ లభించడంతో పాటు రైతులకు అధిక ఆదాయం పొందే అవకాశం ఉంటుందని వివరించారు. రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులను పాటించి నాణ్యమైన పసుపు ఉత్పత్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగు సుప్రియ, బీజేపీ మండల అధ్యక్షుడు ఏనుగు వెంకట్రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

