కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం పండుగ సాయన్న (Panduga Sayanna) జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ వేడుకలుగా నిర్వహించాలని జీవో జారీ చేసింది. దీని ప్రకారం అక్టోబర్ 22న జయంతి, డిసెంబర్ 10న వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాల్సి ఉంటుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర వేడుకలుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ శాఖను నోడల్ శాఖగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ముదిరాజ్ సమాజం గౌరవించే ప్రజా వీరుడు, తెలంగాణ రాబిన్‌హుడ్‌గా ప్రసిద్ధి చెందిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి-వర్ధంతులను అధికారికంగా గుర్తించాలని ముదిరాజ్ సంఘాలు చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని ముదిరాజ్ సంఘం నేతలు కలిసి పండుగ సాయన్న (Panduga Sayanna) జయంతి, వర్దంతులను అధికారికంగా నిర్వహించాలని విన్నవించారు. ఈ క్రమంలో త్వరలోనే జీవో జారీ చేస్తామని సీఎం హామీ నేపథ్యంలో ఈ ఉత్వర్వులు విడుదలయ్యాయి.
Also Read : కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు నమోదు
Follow Us On : WhatsApp

