కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ (Rajiv Gandhi-Sonia Gandhi) ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం ఎలా మొదలైంది? ఆ ప్రేమ పెళ్లి వరకు ఎలా చేరింది? అనే అనే విషయాలు ఇప్పటికీ రహస్యమే. సోనియా-రాజీవ్ గాంధీల ప్రేమకథ 1965లో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో మొదటిసారి మొదలైంది. ఇంజినీరింగ్ చదువుతున్న రాజీవ్ గాంధీకి, ఇటలీ నుంచి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకుంటున్న సోనియాతో ఓ రెస్టారెంట్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. దాదాపు మూడేళ్ల పాటు సాగిన వారి ప్రయాణం, ఇరువురి కుటుంబాల అంగీకారంతో 1968లో ఢిల్లీ వేదికగా పెళ్లి జరిగింది.
వివాహానంతరం సోనియా గాంధీ ఇండియన్ కల్చర్‌ను పూర్తిగా అడప్ట్ చేసుకున్నారు. రాజీవ్ కుటుంబంలో కీలకంగా మారారు. ఆ తర్వాత రాజీవ్ ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీని అనేక దశాబ్దాలుగా సమర్థవంతంగా నడిపించారు. ఇందిరా గాంధీతో ఉన్న అనుబంధం, రాజీవ్‌తో పంచుకున్న మధుర జ్ఞాపకాలు, కుటుంబ విషాదాలు, రాజీవ్ రాజకీయ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను సోనియాగాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించినట్ల సమాచారం. రాజీవ్ గాంధీ జయంతి (ఆగస్టు 20) సందర్భంగా వీరిద్దరి అరుదైన ప్రేమకథ మరోసారి సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. ఇక రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది.

