కలం, వలిగొండ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తిని సహదేవ్ అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ (Valigonda) మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పోలేపాక జానకి రాములు, నాయకులు వాకిటి అనంతరెడ్డి, పబ్బు సురేందర్, కొండూరు భాస్కర్, ఐటిపాముల రవీంద్ర, కాసుల వెంకటేశం, కొండూరు సాయి, రేకుల ప్రభాకర్, అప్పిశెట్టి నరేందర్, కీర్తి రమేష్, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

