కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) తెరకెక్కిస్తోన్న మూవీ ‘స్పిరిట్'(Spirit Movie) . ఈ భారీ చిత్రం ఎప్పుడో సెట్స్ పైకి రావాలి కానీ.. ప్రభాస్ బిజీగా ఉండడం వలన ఆలస్యం అయ్యింది. ఇటీవల ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి వచ్చింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్పిరిట్ మూవీ నుంచి ఆడియో రిలీజ్ చేయడం.. ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తెలిసిందే. అతర్వాత ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. ఇప్పుడు సర్ ఫ్రైజ్ రాబోతుందని తెలిసింది. ఇంతకీ.. ఏంటా సర్ ఫ్రైజ్..?
సందీప్ రెడ్డి వంగ.. ఈ సినిమాని చాలా తక్కువ టైమ్ లో కంప్లీట్ చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేశాడు. దీంతో చక చకా షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. న్యూయర్ సందర్భంగా స్పిరిట్ మూవీ నుంచి ఏదైనా స్పెషల్ వీడియో రిలీజ్ చేసి డార్లింగ్ ఫ్యాన్స్ ను సర్ ఫ్రైజ్ చేయాలి అనుకుంటున్నారట. దీంతో స్పిరిట్ మూవీ (Spirit Movie) నుంచి ఏం రానుంది..? స్పెషల్ పోస్టర్ రానుందా..? స్పెషల్ వీడియో రానుందా..? అనేది ఆసక్తిగా మారింది. వీటితో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా చేయచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas Spirit) క్యారెక్టర్.. యాక్షన్ ఎపిసోడ్స్ వేరే లెవల్లో ఉంటాయట. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అయితే.. సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. విశేషం ఏంటంటే.. షూటింగ్ స్టార్ట్ చేయకముందే డబ్బై శాతం రీ రికార్డింగ్ కంప్లీట్ చేశామని ఆమధ్య సందీప్ చెప్పారు. దీనిని బట్టి ఎంత ప్లానింగ్ తో ఉన్నాడో తెలుస్తుంది. మరి.. స్పిరిట్ న్యూయర్ సర్ ఫ్రైజ్ ఎలా ఉంటుందో చూడాలి.
Read Also: అన్న పెళ్లి రోజే తమ్ముడి పెళ్లి.. కారణం అదేనా?
Follow Us On: X(Twitter)


