కలం, తెలంగాణ బ్యూరో: నిన్నమొన్నటి వరకు రైతు రుణమాఫీ, రైతుభరోసా, ధాన్యం కొనుగోళ్లు, సన్నాలకు బోనస్, విద్యార్థుల ఫీజు రీ ఎంబర్స్మెంట్, ఉద్యోగ నోటిఫికేషన్ల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఆందోళనలు చేపట్టిన బీఆర్ఎస్.. ఇప్పుడు కొత్త రాగం అందుకుంటోంది. కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi), షాదీ ముబారక్ పథకాల అమలుపై నిరసనలకు దిగుతోంది.
కేసీఆర్ హయాంలో పురుడు పోసుకున్న ఈ పథకాన్ని రద్దు చేయడానికి కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగానే ఈ రెండు స్కీములను ఎత్తేసే ఆలోచనే లేదని, కంటిన్యూ చేస్తున్నామని ప్రకటించారు. అసలు ఇంతకీ ఈ స్కీముల అమలులో సక్సెస్ ఎవరిది? ఫెయిల్యూర్ ఎవరిది? లెక్కలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.
కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం కౌంటర్…
ప్రజలకు మంచి చేసే స్కీములను ఎత్తి వేసే ఆలోచన లేదని, కాంగ్రెస్ అంటేనే సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ అని 2024 డిసెంబరు 21న అసెంబ్లీ వేదికగానే సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. 2025 ఏప్రిల్ 30న బసవేశ్వర జయంతి సందర్భంగా గత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఇప్పుడూ కొనసాగిస్తున్నట్లు రవీంద్రభారతి వేదికగా సీఎం క్లారిటీ ఇచ్చారు.
దీనికి మూడు రోజుల ముందు ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ కొన్ని సంక్షేమ పథకాల అమలులో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని, ఆశించిన స్థాయిలో అమలు కావడంలేదని విమర్శించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి అలా కౌంటర్ ఇచ్చారు.
హైకోర్టు ఆదేశాలతో పరస్పర విమర్శలు..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు వీటి అమలును నిలిపేయాలని ఈ నెల 13న ఆదేశించింది. సెప్టెంబరు 9 నాటికి కౌంటర్ అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కౌంటర్ అఫిడవిట్ వేయకుండా తాత్సారం చేసిందని, పథకాన్ని పూర్తిగా ఎత్తివేసేందుకు కుట్ర పన్నిందని బీఆర్ఎస్ లీడర్లు ఆరోపించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. అఫిడవిట్ వేస్తున్నామని, ఇప్పటివరకు జరిగిన విచారణల సందర్భంగా ప్రభుత్వం లేవనెత్తిన వాదనలను, సమర్పించిన వివరాలను గణాంకాల రూపంలో బహిర్గతం చేశారు. ఈ స్కీములను ఎత్తివేసే ఆలోచన లేదని, రాజకీయంగా బదనాం చేయాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నదని ఫైర్ అయ్యారు. ఈ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్ హయాంలో ఎంతమంది లబ్ధిదారులకు ఎంత మొత్తంలో సాయం అందిందనే వివరాలను వెల్లడించారు.
మంత్రి పొన్నం ప్రకారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అమలు ఇలా..
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
వర్గం లబ్ధిదారులు ఆర్థిక సాయం
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ఎస్సీ 2,73,164 మంది రూ.2,734.81 కోట్లు
ఎస్టీ 1,79,939 మంది రూ.1,801.48 కోట్లు
బీసీ 7,79,401 మంది రూ.7,803.05 కోట్లు
ఈబీసీ 83,074 మంది రూ.831.70 కోట్లు
మైనారిటీ 3,62,769 మంది రూ.3,204.83 కోట్లు
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
మొత్తం 16,78,347 మంది రూ.16,375.87 కోట్లు
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
బీఆర్ఎస్ హయాంలో కల్యాణలక్ష్మి (2014-15 నుంచి 2023-24 వరకు లబ్ధిదారులు)
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
సంవత్సరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
2014-15 5,105 2,482 – 5,443
2015-16 30,568 17,353 – 27,695
2016-17 22,455 13,516 26,798 23,520
2017-18 25,224 16,326 61,475 24,944
2018-19 30,607 16,500 82,571 34,224
2019-20 34,598 24,104 71,430 36,310
2020-21 30,868 17,376 1,32,511 29,258
2021-22 36,416 23,797 1,41,272 29,887
2022-23 32,202 22,570 91,996 44,264
2023-24 23,626 17,715 71,116 41,858
––––––––––––––––––––––––––––––––––––––––––––––––
మొత్తం 2,71,669 1,71,739 6,79,169 2,97,403
–––––––––––––––––––––––––––––––––––––––––––––––
గ్రాండ్ టోటల్ 14,19,980 (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కలిపి)
బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన మొత్తం : (కోట్ల రూ.ల్లో)
––––––––––––––––––––––––––––––––––––––––––––––
సంవత్సరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ
––––––––––––––––––––––––––––––––––––––––––––––
2014-15 26.04 12.66 – 27.75
2015-16 155.90 88.50 – 141.24
2016-17 114.52 68.93 136.66 119.96
2017-18 166.02 108.62 386.82 162.26
2018-19 274.07 146.79 690.71 291.67
2019-20 342.23 236.72 694.17 356.03
2020-21 308.39 173.50 1,320.32 291.40
2021-22 364.56 238.18 1,413.82 298.20
2022-23 322.47 225.97 921.19 442.68
2023-24 236.64 177.39 712.29 419.13
––––––––––––––––––––––––––––––––––––––––––––
మొత్తం 2,310.84 1,477.26 6,275.98 2,550.32
–––––––––––––––––––––––––––––––––––––––––––––
గ్రాండ్ టోటల్ రూ.12,614.42 కోట్లు (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కలిపి)
కాంగ్రెస్ హయాంలో లబ్ధిదారులు (2023 డిసెంబరు – మార్చి 20, 2026 నాటికి)
ఎస్సీ : 42,455
ఎస్టీ : 28,275
బీసీ : 1,30,714
ఈబీసీ : 13,508
మైనారిటీ : 65,181
––––––––––––––––––––
మొత్తం : 2,80,133
––––––––––––––––––––––
మొత్తం వెచ్చించిన నిధులు: రూ.2,805.72 కోట్లు
బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలో సగటున ఏటా..
లబ్ధిదారులు : 1,49,471 మంది
నిధులు : రూ. 1,327 కోట్లు
కాంగ్రెస్ రెండున్నరేళ్ల హయాంలో సగటున ఏటా..
లబ్ధిదారులు : 1,40,066 మంది
నిధులు: రూ. 1,402.86 కోట్లు

